27-07-2025 01:15:20 AM
ముఖ్యమంత్రికి బీసీ కమిషన్ లేఖ
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): వెనుకబడిన తరగతుల విద్యార్థులకు పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ అడ్మిషన్లకు సంబంధించిన అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ కోరింది. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం మెరిటోరియస్ రిజర్వ్ అభ్యర్థి (ఎంఆర్‌సీ) ఖాళీ చేసిన సీటును అదే రిజర్వ్డ్ కేటగిరికి చెందిన మరొక అభ్యర్థితో భర్తీ చేయకపోవడం ద్వారా బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత నిబంధన బీసీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందని తెలిపింది. అలాంటి సీట్లు ఓపెన్ కేటగిరీ అభ్య ర్థులకు బదిలీ అవుతున్నాయని, దీనివల్ల వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశా లు తగ్గుతున్నాయని వివరించింది.