27-07-2025 01:13:10 AM
- కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కుత్బుల్లాపూర్, జులై 26 (విజయక్రాంతి): కొత్త సంస్థగా తెలంగాణ జాగృతిని నిర్మించబోతున్నామని, ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భం గా రాష్ట్ర వ్యాప్తంగా జంబో కమిటీలు వేస్తామని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. ఆగష్టు నుంచి ప్రతి నెల ఉమ్మడి పది జిల్లాల వారీగా నాయకత్వ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. తెలంగా ణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లిలో శనివారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు.
మనం నాయకులం అయ్యి మనతోపాటు మరికొందరిని నాయకులను తయారు చేసుకోవాలన్నదే ఈ శిక్షణా తరగతుల ఉద్దేశం అన్నారు. నాయకుల ఆలోచన లు, అంచనాలు సుభాష్ చంద్రబోస్‌ను, మదర్ థెరిస్సాను పోలి ఉండి, చాకలి ఐల మ్మ పోరాట పటిమ కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాజకీయాలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. తెలంగాణ జాగృతి కేవలం తెలంగాణ వా దం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నాం, ఈనా డు మరో ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇందుకు మహిళా నాయకులు,బహుజన నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.