4 May, 2026 | 12:34 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

09-03-2026 04:55 PM

శ్రీనివాస చారి కొల్చారం తహసిల్దార్

కొల్చారం,(విజయక్రాంతి): కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా టీ జంక్షన్ సమీపంలో సర్వేనెంబర్ 251లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో  తెలిపారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న అక్రమ నిర్మాణాలను పై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని వ్యాపార వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే సంబంధిత భూముల పట్టాలను రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు వెంటనే సర్వే నంబర్ 251 లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు.