శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెక్కు అందజేత
09-03-2026 04:48 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవాపూర్ గ్రామానికి చెందిన బండి గంగన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 10 లక్షల 31,వేల 250 రూపాయలు అందజేశారు. సోమవారం ఆ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీ డీజీఎం సురేష్, డిఎం రవిలు ఆ వ్యక్తి నామిని అయిన భార్య అమృతకు ఈ నగదు అందజేసినట్లు ఆ శాఖ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ఆడే విజయ ఉత్తం, కడం ఎస్ఐ సాయికుమార్, ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ వినోద్ కుమార్, సిబ్బంది బెనిట్, అశోక్, ప్రవీణ్, రమేష్, డివో పోకవేణి మల్లేష్, దేవేందర్, వేణు గౌడ్, పలువురు పాల్గొన్నారు.




