ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలి
09-03-2026 04:58 PM
తమ స్వంత ఇంటి అవసరాల కోసం అయిన సేంద్రియ సాగు చేపట్టాలి
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోనీ సర్వాయి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ సాగు పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ముంజ మహేష్ యాదవ్ మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభాలు పొందవచ్చని, క్రిమి సంహారక మందుల వాడకం తగ్గించి ముందు తరాలవారికి ఆరోగ్యవంతమైన జీవితం అందించవచ్చు అని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పోషక విలువలు పెరుగుతాయని అందరూ ప్రకృతి వ్యవసాయం పై మొగ్గు చూపాలని సూచించారు.




