calender_icon.png 6 May, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృక్షాల ఆవశ్యకతను తెలియజేసేందుకు 5కే రన్

06-05-2025 12:00:00 AM

వృక్షధామ ఫౌండేషన్ ఫౌండర్ కళ్యాణి బెల్లంకొండ 

ఖైరతాబాద్, మే 5 (విజయక్రాంతి): పర్యావరణంలో వృక్ష సంపద ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈనెల 11న గచ్చిబౌలి స్టేడియంలో 5కే, 3కే,2కే రన్‌లను నిర్వహిస్తున్నట్లు వృక్షధామ ఫౌండేషన్ ఫౌండర్ కళ్యా ణి బెల్లంకొండ తెలిపారు. సోమవారం  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వృక్షధామ ఫౌండేషన్ ఫౌండర్ కళ్యాణి బెల్లంకొండ  మాట్లాడు తూ..

భారతదేశంలో రోజురోజుకు తరిగిపోతున్న వృక్ష సంపద వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షించుకోవడంలో వృక్షాల పాత్రపై ప్రజల్లో అవగాహనను కలిగించేందుకు ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు, గ్రామాలలో నీటి వనరుల పెంపుకు దోహదపడే లక్ష చెట్లను జూన్, జూలై నెలల్లో పంపి ణీ చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల పాత్ర చాలా గొప్పగా ఉండనున్నట్లు తెలిపారు. ఈ  రన్ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబులను ఆహ్వానించినట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు దక్షిత, నిత్య సంతోషి, ప్రణిత దేవరెడ్డి, మురళి చదలవాడ తదితరులు పాల్గొన్నారు.