13 August, 2026 | 1:49 AM

గోదారిని తోడండి

13-08-2026 12:00 AM
  1. జలాలను గరిష్ఠంగా వినియోగించాలి
  2. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయండి
  3. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల్లో .. ఎన్డీఎస్‌ఏ సూచనలు పాటించాలి 
  4. ఇరిగేషన్ సమీక్షలో సీఎం రేవంత్

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): గోదావరి జలాలను వేగంగా తోడిపోయాలని, గరిష్ట స్థాయిలో వినియోగించుకో వాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవా దుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి నీటిని సాధ్యమైనంత మేరకు ఎత్తిపోయాలన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల్లో నీటి ని నిల్వచేయడం లేదని, ఎన్డీఎస్‌ఏ సూచనలు పాటించాలని చెప్పారు. పలు ప్రాజె క్టుల కింద పరిహారం.. పునరావా సం చెల్లింపులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

గూడెందొడ్డి పంప్ స్టోరేజీ ప్రాజెక్టుపై కన్సల్టెన్సీని నియమించాలని అధికారులను ఆదేశి ంచారు. అలాగే ఆర్మీ ఉద్యోగాలకు తెలంగా ణ యువతను సిద్ధం చేస్తామని సీఎం రేవం త్ వెల్లడించారు. నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నీటి పారుదల శాఖపై రేవంత్‌రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో బుధవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్ ల్లో నీరు నిల్వ చేయడం లేదన్నారు.

మేడిగడ్డతో పాటు సుందిళ్ల బరాజ్‌లోనూ అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎన్డీఎస్‌ఏతో సంప్రదించాలని సూచించారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే అధికారులు వాటి పరిష్కారంపై ప్ర త్యేకంగా దృష్టిసారించాలని సీఎం సూచించారు.

పలు ప్రాజెక్టుల కింద ఒకటి, రెండు గ్రామాలు, కొద్ది పాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండిం గ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశి ంచారు. నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ముంపు గ్రా మాలు, పరిహారం, పునరా వాసానికి సం బంధించి వాస్తవ నివేదిక రూపొందించాలన్నారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెం టనే పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు.

అధికారులు ఆ పనులను పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. గ ట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెం పునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్‌స్టోరేజీ ప్రా జెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియ మిం చాలన్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ పాల్గొన్నారు.

ఆర్మీ ఉద్యోగాలకు రెడీ చేస్తాం 

భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధం గా కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభు త్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని భారత ఆర్మీ సదరన్ క మాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీ రాజేష్ పుష్కర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపై చర్చించారు. ఆర్మీ నియామకాల్లో స్థానిక యువత కు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆస క్తి చూపుతున్న, అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్ష ణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రా జేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. 

రేపు పూలే విగ్రహావిష్కరణ

హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పా టు చేస్తున్న జ్యోతిబా, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.