13 August, 2026 | 1:51 AM

చక్కగా నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు..

13-08-2026 12:00 AM
  1. రూ.20 లక్షల ప్రజాధనం  వృధా..
  2. గర్భిణులకు గంపెడు కష్టాలు..
  3. చిన్నారులకు చెప్పలేని  అవస్థలు..
  4. నిర్మించి ప్రారంభించని దోమకొండ వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ 
  5. దోమకొండ గ్రామపంచాయతీ వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం 

దోమకొండ, ఆగస్టు 12 (విజయ క్రాంతి):సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో 2023లో వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ చక్కగా నిర్మించారు. నిర్లక్ష్యంగా వదిలేశారు. గర్భిణీ స్త్రీలకు గంపెడు కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకటి నుండి తొమ్మిది సంవత్సరాల చిన్నారులకు చెప్పలేని కష్టాలు వస్తున్నాయి. దోమకొండ గ్రామపంచాయతీకి ఆనుకుని 20 లక్షల రూపాయల వ్యయంతో 2023లో నిర్మించిన వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్  ప్రారంభించకపోవడంతో గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు మహిళలకు చెప్పలేని కష్టాలు ఎదురవుతున్నాయి.

పాత తాలూకా కేంద్రం సుమారు 20వేల జనాభా గల దోమకొండ లో నిర్మించి మూడు ఏళ్లు గడుస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ అందుబాటులోకి రాకపోవడంతో వందలాది మంది గర్భిణీలు చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర ప్రాణాంతక వైద్య సేవ ఉండాల్సిన చోట వైద్య చికిత్సలు మందుల సరఫరా చిన్నారుల కు ఇవ్వాల్సిన టీకాలు ఇతర ప్రాణాంతక నిరోధక వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడంతో చెప్పలేని కష్టాలు ఎదుర్కొంటున్నారు.

సబ్ సెంటర్ చుట్టూ అడుగుల దూరంలో దోమకొండ గ్రామపంచాయతీ, ఎమ్మార్వో కార్యాలయం, ఎంపి డిఓ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండు అతి దగ్గరలో ఉన్న, నిర్మించి మూడేళ్లు  గడుస్తున్న వైద్య సేవలు  అందించే సబ్ సెంటర్ అందుబాటులోకి రాకపోవడంతో మహిళలు, చిన్నారులు, తీరని వేదనకు గురవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంతో సబ్ సెంటర్ ప్రారంభించడానికి నోచుకోవడం లేదు. 20 లక్షల రూపాయల వ్యయంతో భవనం నిర్మించిన వైద్య సేవలు, టీకాలు, మందుల సరఫరా, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రాకపోవడంతో దోమకొండ మండల ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అధికారులకు చిత్తశుద్ధి లోపించడం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం, అధికార పార్టీ నేతలకు తీరిక లేకపోవడం పట్ల దోమకొండ మండల వాసులు, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ సెంటరు లో నడుస్తున్న హెల్త్ సెంటరు ను డాక్టర్లు పొమ్మంటున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు,    ప్రారంభించడం లేదని ఆరోగ్య శాఖ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. సుమారు 20 వేల జనాభా కలిగి, కామారెడ్డి జిల్లాలో అతిపెద్ద గ్రామపంచాయతీ అయి,పాత తాలూకా కేంద్రం లో అత్యవసర వైద్య సేవలు అందించి సబ్ సెంటర్ నిరుపయోగంగా పడింది. ప్రతిరోజుnవందలాది చిన్నారులకు  టీకాల పంపిణీ కావడం లేదు.

గర్భిణి స్త్రీలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి భవనం నుండి  పొమ్మంటున్నారు. భవనం నిర్మించి స్టార్ట్ చేయకుండా వదిలేసారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి ప్రతీక గా ఉండింది. దోమకొండ సబ్ సెంటర్ దుస్థితి గ్రామాల్లో తీవ్ర చర్చ అవుతుంది. దోమకొండలో పలుగడ్డ ప్రాంతంలో అద్దెగదిలో రెండో సబ్ సెంటర్  నిర్వహణ జరుగుతుంది.  అధికారులు పట్టింపు లేదు,  27-9-2023 లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సబ్ సెంటర్కు 20 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. చక్కగా నిర్మించారు. లక్షణంగా వదిలేశారనీ మండల ప్రజలు విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ లు సబ్ సెంటర్ భవనంలో ఫ్లోరింగ్ నిర్మించలేదు.

కిటికీలు ఆమార్చలేదు,దర్వాజలు పెట్టలేదు,  కరెంటు సరఫరా లేదు,వాటర్ వసతి లేదు. కనీస సౌకర్యాలు కూడా లేవు అని విమర్శలు ఎదురవుతున్నాయి. దోమకొండ పంచాయతీ ఆఫీసు వెనకాల ఉన్న, సబ్ సెంటర్ భవనంలో పాములు, తేళ్లు సంచారం చేస్తున్నాయని స్థానికవాసులు వాపోతున్నారు. 20 లక్షల తో నిర్మించిన సబ్ సెంటర్ భవనము ఉపయోగించకుండా పలుగడ్డ ప్రాంతంలో రెండో సబ్ సెంటర్ ను ప్రారంభించడంతో మండల వాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెల్త్ సెంటర్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని దోమకొండ ప్రజలు కోరుతున్నారు.