calender_icon.png 1 December, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్సై రవి గౌడ్

01-12-2025 07:39:22 PM

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం, పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని, గుంపులుగుంపులుగా తిరగడానికి అనుమతి లేదని, అనుమతి లేని ప్రచారాలు చేపట్టడం పూర్తిగా నిషేధమని కల్హేర్ ఎస్సై రవి గౌడ్ అన్నారు. నిబంధనలు అతిక్రమించి ర్యాలీలు తీస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు. గ్రామాల్లో అనుమతి లేకుండా నిర్వహించే బెల్టు దుకాణాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందని, అక్రమ మద్యం నిల్వ ఉంచినా, విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు.

నగదు రవాణాపై ఆంక్షలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంపిణీ జరగకుండా చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతామని, 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లరాదని, సరైన పత్రాలు ఆధారాలు లేకుండా పరిమితికి మించి సొంత డబ్బులు తరలించినా వాటిని జప్తు చేస్తామని, ఎన్నికలు ప్రశాంత  వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎవరైనా ఎన్నికల నియమాలికి విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఎస్సై రవి గౌడ్ కోరారు.