calender_icon.png 1 December, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొలెరో వాహనం పల్టీ.. ఎస్పీ స్వయంగా సహాయక చర్యలు

01-12-2025 08:13:13 PM

చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల–సూర్యాపేట రహదారిపై గురుకుల పాఠశాల వద్ద బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పల్టికొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ స్వయంగా ముందుకు వచ్చారు. ఎన్నికల నామినేషన్ పనుల పర్యవేక్షణకు చివ్వెంలకు వెళ్తూ ప్రమాదాన్ని గమనించిన ఎస్పీ, వెంట ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి వాహనాన్ని లేపి రోడ్డుపై నుంచి తొలగించారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు వెంటనే మార్గం క్లియర్ చేశారు.