01-12-2025 07:53:28 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి సోమవారం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారులకు జరిమానాలు విధించారు. పాదచారుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ ఫుట్‌పాత్‌లను ఉంచాలని నెల రోజులుగా పోలీసులు సూచిస్తున్నారు. తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నవారు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, ఇతర వ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించవద్దని పోలీసుల హెచ్చరించారు.