calender_icon.png 1 December, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ బరిలో బీజేపీ నాయకుని సతీమణి

01-12-2025 07:42:42 PM

మానకొండూర్ (విజయక్రాంతి): రామక్రిష్ణ కాలనీ సర్పంచ్ గా బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి సతీమణి సుగుర్తి రేఖ నుస్తులాపూర్ ఎన్నికల కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేసారు. తన మద్దతు దారులతో, కొంతమంది గ్రామస్తులతో కలిసి ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసారు. గత పన్నెండేళ్లుగా తన భర్త జగదీశ్వరా చారి గ్రామ ప్రజల సంక్షేమం కోసం తన వంతుగా సహాయకార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడని సర్పంచ్ అభ్యర్థి రేఖ పేర్కొన్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న నిధులతో గ్రామంలో ఎన్నో ప్రయోజనకరమైన అభివృద్ధి పనులను చేయడం జరిగిందని అందుకే ప్రజలు అభివృద్ధికి సహకరించేవారికే పట్టం కడతారని అన్నారు.