calender_icon.png 19 July, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు

19-07-2025 12:44:04 AM

కొయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ డిఎం&హెచ్వో డాక్టర్ సైదులు

చర్ల, జూలై 18, (విజయ క్రాంతి): వైద్యాధికారులు సమయపాలన పాటించకుంటే శాఖా పరమైన చర్యలు తప్పవని అడిషనల్ డీ ఎం అండ్ హెచ్ వో డాక్టర్ సైదులు హె చ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని శుక్రవారం ప్రాథమిక ఆరో గ్య కేంద్రం కొయ్యూరు ను అకస్మికంగా తనకీచేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికా రడ్స్ పరిశీలించి తగు సూచనలు చేశారు, డా క్టర్ శ్రీధర్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు చేస్తున్న వైద్య సేవలను తెలుసుకొని అభినందించారు, ఆస్పత్రిసిబ్బంది సమయ పాలన పాటించాలని విధులు అశ్రద్ధ చేసినట్లయితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు.వర్షాకాలం కావడంతో మలేరియా ,డెం గు, టైఫాయిడ్ ,అతిసార వ్యాధి మొదలగు వ్యాధులు ప్రభలే అవకాశం ఉందనీ, సిబ్బం ది అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలన్నా రు. ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేసి జ్వ రాలు ఎక్కువ ఉన్న గ్రామాల్లో ప్రత్యేకమైన వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.ఈ కా ర్యక్రమంలో డిప్యూటీ డియం అండ్ హెచ్ ఓ డాక్టర్ చైతన్య, వైద్యాధికారి ప్రాథమిక వై ద్య కేంద్రం చర్ల(కొయ్యూరు)డాక్టర్ శ్రీధర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.