19-07-2025 12:42:25 AM
క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): మహారాష్ట్ర సీఎం జలవనరుల సలహాదారుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర జల్ శక్తి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ను నియమించింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వి జన్ 2047తో దీర్ఘకాలిక జలవిధానంపై దృష్టి సారించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా న దుల అనుసంధాన ప్రాజెక్టుల కోసం సమగ్ర దీర్ఘకాలిక విధానాన్ని సిద్ధం చేయడానికి, నీటి సంరక్షణ, భూగర్భ జలాల నిర్వహణ, తాగునీటి సరఫరా పథకాలకు ప్రణాళికలు రూపొందించడానికి కార్యాచరణ చేపట్టనున్నారు. నీటి నిర్వహణ, విధానాలు, పునర్విని యోగ వ్యూహాల్లోని వివిధ అంశాల్లో సంస్కరణలు, అమలు వ్యూహాలను సిఫార్సు చేయ నున్నారు. సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు శ్రీరామ్ పనిచేసే అవకాశముంది.