3 April, 2026 | 8:49 PM

కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి

06-05-2024 02:09 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

అందోల్, మే 5 : కాంగ్రెస్ కార్యకర్తలంద రూ కలిసి కట్టుగా పనిచేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ శెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి దామోదర రాజ నర్సింహ కోరారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండల కేంద్రంలో మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జహీరాబాద్‌లో కాంగ్రె స్ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావలన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తు ఓట్లు అభ్యర్థించాలన్నారు.

జహీరాబాద్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని కార్యకర్తలకు మంత్రి సూచించారు. పది సంవత్సరాల నుంచి అందోల్ అభివృద్ధికి అమాడ దూరంలో ఉందన్నారు. కాంగ్రెస్ హయంలో అందోల్‌ను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తామన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ శెట్కార్‌ను గెలిపించుకుంటే అభివృద్ధికి పట్టం కట్టినవళ్లం అవుతాం అన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ శెట్కార్, మండల పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.