26-07-2025 12:00:00 AM
సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్
చేగుంట/తూప్రాన్, జూలై 25 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం తూప్రాన్, చేగుంటలో నిర్వహించిన మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చిత్తశుద్ధి కలిగి ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.
అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. చేగుంట సమావేశంలో దుబ్బాక నియోజవర్గ ఓ కన్వీనర్ గోవింద్,చేగుంట మండల జనరల్ సెక్రెటరీ జూకంటి శోభన్ ఉపాధ్యక్షుడు కావేట్ వెంకటేష్, టెలికాం బోర్డ్ మెంబర్ మంద బాలచందర్ ఎక్స్ ఎంపీపీ కర్ణ పాండు మాజీ సర్పంచులు రఘువీర్,బెదిరిపోయిన నాగభూషణం. మాజీ ఎంపీటీసీలు హరిశంకర్ రవి ఓబిసి మోర్చా నాయకుడు కర్ణం గణేష్ మాజీ మండలాధ్యక్షుడు చింతల భూపాల్, బీజేవైఎం ప్రెసిడెంట్ శేఖర్ పాల్గొన్నారు.
అలాగే తూప్రాన్ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల పోచయ్య, జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల కన్వీనర్ తుంగ కనకయ్య, ఏళ్ళు రాంరెడ్డి, నత్తి మల్లేష్ ముదిరాజ్, అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, శ్రీనివాస్ రెడ్డి, తూప్రాన్ మండల మాజీ అధ్యక్షులు సిద్దిరాములు యాదవ్, మండల బీజేపీ జనరల్ సెక్రటరీ అంబటి మహేష్ యాదవ్, పిట్ల శేఖర్, చుక్క రాము, శక్తి కేంద్రం ఇంచార్జ్ కుంట రాజు, సందీప్ గడ్డి, నర్సింలు, మండల ఉపాధ్యక్షులు ఉప్పరి నర్సింలు, సీత నరేష్, కార్యకర్తలు జోడు నవీన్, కుంట రవి, కరుణాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.