calender_icon.png 26 July, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి

26-07-2025 12:00:00 AM

కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ 

కామారెడ్డి, జూలై 25 (విజయ క్రాంతి): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తమై అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.

ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి  ఆసుపత్రిలో అందుతున్న సేవల  గురించి అడిగి తెలుసుకున్నారు.  వివిధ విభాగాల లోని సేవలు తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం దేమే కలాన్ లో ప్రబలిన అతిసార వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామస్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది తగిన ముందుగా చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.