calender_icon.png 27 July, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి

26-07-2025 12:00:00 AM

- జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

జడ్చర్ల జూలై 25 : ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం జడ్చర్లలో డ్రై డే లో భాగంగా వార్డు నెంబర్ 3,14 లో పరిసరాలను ప్రత్యేకంగా పరిశీలించి ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. పాత బస్ స్టాండ్ లో వ్యర్థాలు,చెత్త తొలగించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్చర్ల మండలం బాదేపల్లి గ్రామంలో అగ్రోస్  రైతు సేవా కేంద్రం-2 గోదాం ను కలెక్టర్ తనిఖీ చేశారు.గోదాంలో ఎరువుల నిల్వ స్టాక్ ను తనిఖీ చేశారు.రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా, ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మా రెడ్డి,ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర కళ,వ్యవసాయ అధికారులు ఉన్నారు.