23-11-2025 08:04:00 PM
దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్స్ లో ఉత్తమ డెబ్యూ నటుడిగా అవార్డు గెలుచుకున్న తెలుగు హీరో ధర్మ మహేష్ తన మండి బిజినెస్ పేరులో మార్పులు చేశారు. తన కుమారుడి పేరు కలిసేలా జిస్మత్ మండిగా ఆవిష్కరించారు. ఫుడ్ లవర్స్ అమితంగా ఇష్టపడే మండి బిజినెస్ లో గతంలోనే అడుగుపెట్టిన ధర్మ మహేశ్ అమీర్ పేట్ లో తన రెస్టారెంట్ ను మరింత కొత్తగా తీర్చిదిద్దారు. తన కుమారుడు జగద్వాజ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ పేరును Gismat నుంచి JISMAT గా మార్పు చేశారు. ఇప్పుడు కొత్త గుర్తింపుతో జిస్మత్ మండి పేరుతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు.
ఈ రెస్టారెంట్ ఓనర్ షిప్ ను తన కుమారుడి పేరిటే నిర్వహిస్తున్న ధర్మ మహేశ్ 18 ఏళ్ళు వచ్చే వరకూ గార్డియన్ గా ఉంటానని తెలిపారు. మండి బిర్యానీలో హైదరాబాద్ వాసుల నుంచి తమ జిస్మత్ జైలు మండికి ప్రత్యేక గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి బిర్యానీ ప్లేట్, ప్రతి కస్టమర్ చిరునవ్వు, ఈ బంధం యొక్క ఆప్యాయతను మోసుకెళ్తాయనీ, మా రుచి, మా నాణ్యత, మా ఆప్యాయత ఈ కొత్త పేరుతో మరింత బలంగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఈ రీబ్రాండింగ్ నాణ్యత, భావోద్వేగం, మరియు వారసత్వంతో కూడిన కొత్త దశగా అభివర్ణించారు. చట్టపరంగా , వ్యాపారపరంగా జిస్మత్ ట్రేడ్‌మార్క్‌కు ఏకైక హక్కుదారుడు తాననని ధర్మ మహేష్ స్పష్టం చేశారు.