calender_icon.png 25 November, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన ‘కేర్’

25-11-2025 12:00:00 AM

వైద్యుల లాపరోస్కోపిక్ నైపుణ్యంతో దక్కిన ప్రాణం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): మలక్‌పేట కేర్ హాస్పిటల్స్‌లో నల్లగొండకు చెందిన 72 ఏళ్ల వృద్ధు రాలికి లాపరోస్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహిం చారు. ఉదరం కుడివైపు ఎగువన తీవ్రమైన నొప్పి, హైపర్ టెన్షన్‌తో ఆస్పత్రికి చేరుకున్న ఆమెను వైద్యులు సమయానికి చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. వృద్ధురాలి పిత్తాశయం చిట్లి, తీవ్రమైన కాలిక్యులస్ కోలిసిస్టి టిస్ ఉన్నట్టు గుర్తించి, యాంటీబయాటిక్స్, ఐనోట్రోపిక్ సపోర్ట్ ప్రారంభించారు.

కరోనరీ ఆర్టరీ డిసీజ్, మునుపటి స్ట్రోక్ , దీర్ఘ కాలిక మూత్రపిండాల వైఫల్యం, షుగర్, హై బీపీ ఉండటం, అలాగే నిరంతర యాంటీ ప్లేట్లెట్ మందులు తీసుకుంటుండటం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. సర్జికల్ గ్యాస్ట్రో ంటరాలజీ, రోబోటిక్ సర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని బృందం లాపరోస్కోపిక్ అథెసియోలిసిస్, కోలిసిస్టెక్టమీతో పాటు పూర్తి పెరిటోనియల్ వాష్ నిర్వహించింది.

క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్య బృందం వెంటనే చేసిన శస్త్రచికిత్స వల్ల తీవ్రమైన సెప్సిస్, అవయవాల పనితీరు దెబ్బ తినే ప్రమాదం తప్పిపోయింది. శస్త్రచికిత్స అనంతరం రోగిలో కేవలం 24 గంటల్లోనే కోలుకునే లక్షణాలు కనిపించాయి, తర్వాత సజావుగా ఆరోగ్యవంతంగా కోలుకుంది. ఈ సర్జరీ గురించి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్లా మాట్లాడుతూ..

‘ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా కేర్ హాస్పిటల్స్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ క్లినికల్ సిస్టమ్ ఎంత బలంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపిస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఉన్న, పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగిని కాపాడేందుకు, ఎమర్జెన్సీ ప్రతిస్పందన, డయాగ్నస్టిక్స్, శస్త్రచికిత్స నైపుణ్యం, శస్త్రచికిత్స తర్వాత క్లిష్టమైన సంరక్షణ, ఇవన్నీ ఒకే దారిలో, సజావుగా జరిగాయి’ అని చెప్పారు.