calender_icon.png 2 August, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటి కల్పికకు హైకోర్టులో ఊరట

01-08-2025 01:38:42 AM

అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశం

శేరిలింగంపల్లి,జులై 31: సినీ నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో నేడు పెద్ద ఊరట లభించింది. ఆమెపై నమోదైన రెండు కేసుల్లో కూడా ఆమెను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు, ఈ మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో జరిగిన వివాదం నేపథ్యంలో కల్పికపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

మే 29న ఆమె పబ్కి వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బందితో తీవ్ర వాగ్వాదం జరగిన సంగతి తెలిసిందే. కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వలేదన్న కారణంతో మొదలైన వివాదం తీవ్ర స్థాయికి చేరి, ప్లేట్లు విసిరేసినట్లు, బాడీ షేమింగ్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఐపిసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అలాగే ఈ ఘటనపై నటి కల్పిక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మరో ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. దీంతో రెండో కేసుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుండి రక్షణ కోరుతూ కల్పిక హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిష్ప విచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుతానికి ఆమెను అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది.