calender_icon.png 2 August, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ

01-08-2025 01:38:55 AM

ఖైరతాబాద్; జూలై 31 (విజయ క్రాంతి) ప్రజాయుద్ధనౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ ను ఆగస్టు 6న రవీంద్ర భారతిలో జరపనున్నట్లు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యద ర్శి సూర్యకిరణ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, గద్దర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరగనున్న వర్ధంతి సభలో ప్రజాప్ర తినిధులు, సినీ ప్రముఖులు, మేధావులు  రచయితలు కళాకారు లు, ప్రజా సంఘాల నేతలు, సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ ఉద్యమకా రులు, విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు..  గద్దర్ సమగ్ర సాహిత్యా న్ని ప్రచు రించాలని లక్ష్యంతో ముందుకు పోతున్న గద్దర్ ఫౌండేషన్ రెండో వర్ధంతి సందర్భంగా గద్దర్ రాసిన మా పల్లె , ప్రతిపాటకు ఒక కథ ఉంది పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని అన్నారు.

గద్దర్ జీవితాంతం చేసిన కృషి ఆచరించిన విలువలపై ఆయన స్మృతిలో అనేకమంది కవులు, కళాకారులు, రచయితలు రచనలతో రూపుదిద్దుకున్న గద్దర్ యాదిలో పాలధార పాట పుస్తకాన్ని ఆవిష్కరించబడుతుందని తెలిపారు. గద్దర్ ఆశయ అభిమానులు, కవులు, కళాకారులు  ప్రజలు రెండో వర్ధంతి సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.