calender_icon.png 1 August, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి

01-08-2025 01:37:10 AM

తెలంగాణ కమ్మ సమాఖ్య 

ఖైరతాబాద్;  జూలై 31 (విజయక్రాంతి) : గత పది రోజుల క్రితం బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కమ్మ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఎంపీ సీఎం రమేష్ బహిరంగ ప్రకటనపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది.

ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమైక్య సభ్యులు రవి శంకర్ రావు, సుబ్బారావు, ఉప్పలపాటి రాణి లు మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 కమ్మ సంఘాలలో 25 లక్షల జనాభా ఉన్నారని తెలిపారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అన్ని రాజకీయ పార్టీలలో తమ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు.

అలాంటి కమ్మ సామాజిక వర్గ వ్యక్తులను అవమానించే విధంగా కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని తన వద్ద సిసి కెమెరాల లో రికార్డ్ అయిన ఆధారాలు ఉన్నాయని సీఎం రమేష్ బహిరంగ ప్రకటన చేయడం. దీనిపై కేటీఆర్ స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. కార్యక్ర మంలో సమైక్య సభ్యులు కంచర్ల గోపాలకృ ష్ణ, దిలీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.