05-11-2025 12:00:00 AM
-ఫేస్‌బుక్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు
-బెంగళూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్
బెంగళూరు, నవంబర్4: ఫేస్‌బుక్ వేదికగా తనను వేధిస్తున్న యువకుడిపై కన్నడ, తెలుగు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీ న్ అనే వ్యక్తి నుంచి కొద్దిరోజుల క్రితం ఒక సీరియల్ నటికి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్‌ను ఆమె తిరస్కరించడంతో అతడు ఫేక్ అకౌంట్లు సృష్టించాడు.
వాటి ద్వారా ఆమెపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు. తరచూ ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపించేవాడు. దీంతో నటి అతడి ఐడీని బ్లాక్ చేశారు. అయినా.. నిందితుడు మరికొన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించి చేసి, వాటి నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూనే ఉన్నాడు. వేధింపులు తాళలేని నటి తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు అన్నపూర్ణేశ్వరినగర్ పోలీసులు రంగంలోకి దిగి, అత్యాధునిక సాంకేతికతను వినియోగించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.