05-11-2025 12:00:00 AM
నూతన మండల విద్యాధికారిగా చంద్రశేఖర్
గోపాలపేట నవంబర్4: విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానని మండల విద్యాధికారి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం గోపాలపేట మండలంలోని ఎమ్మార్సీ కార్యాల యంలో మండల విద్యాధికారిగా చంద్రశేఖ ర్ నూతన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఎం ఈ ఓ గా బాధ్యతలను చేపట్టిన చంద్రశేఖరను మండలంలోని పాఠశాలల ఉపాధ్యా యులు శాలువా కులమాలతో ఘనంగా స న్మానించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ మాట్లాడారు. గోపాలపేట మం డలంలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షిస్తానని అన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో నెల కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యే వరకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు బాగా చదివి గ్రేట్ వచ్చే విధంగా మోటివేట్ చేస్తానని చెప్పారు. అనంతరం తదితర ఉపాధ్యాయులు సన్మానించి మిఠాయిని తినిపించారు.
సన్మానించి న వారిలో మాజీ ఎంఈఓ ప్రభాకర్ జిల్లా పరీక్షల అధికారి గణేష్ కుమార్ అసిస్టెంట్ డి సి ఈ బి సెక్రెటరీ శ్రీనివాసరావు మాజీ ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయ సం ఘాల నాయకులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.