చక్కని వేసవి వినోదం!

30-04-2024 12:05:00 AM

“బాక్’ చిత్రం చాలా కొత్త అనుభూతినిచ్చే చిత్రం. సుందర్ సి దర్వకత్వ ప్రతిభకు ఈ ట్రైలర్ ఒక ఉదాహరణ. ఈ చిత్రంలో రాశితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా వుంది” అన్నారు కథానాయిక తమన్నా భాటియా. విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి రాబోతున్న నాల్గవ చిత్రం ‘బాక్’. తమన్నా, రాశిఖన్నా నటించిన ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ “ఈ చిత్రం విజువల్స్ చాలా రిచ్‌గా వుంటాయి. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. తప్పకుండా చిత్రం ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేస్తుంది. అందరూ తప్పకుండా ఫ్యామిలీతో  కలిసి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు. రాశిఖన్నా మాట్లాడుతూ “సుందర్ సి ఈ చిత్రానికి బ్యాక్‌బోన్. ఆయన చాలా క్లారిటీతో ఈ సినిమా చేశాడు. నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో ‘అరణన్మై సమయంలో తెలిసింది. తమన్నా ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో హారర్, గ్లామర్ థ్రిల్ల్ కామెడీ అన్ని వున్నాయి. ఇది ఈ వేసవికి చక్కటి వినోదం. అందరూ కుటుంబంతో కలిసి తప్పకుండా చూడాలి” అన్నారు.