calender_icon.png 20 September, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదినారాయ‌ణ స్వామిని ద‌ర్శించుకున్న అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌

20-09-2025 09:25:06 PM

జిన్నారం: సంగారెడ్డి జిల్లాలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన కొడ‌కంచి భూదేవి, శ్రీదేవి స‌మేత ఆదినారాయ‌ణ స్వామిని అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మాధురి శ‌నివారం ద‌ర్శించుకున్నారు. ఆల‌య పూజారులు అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆదినారాయ‌ణ స్వామిని ద‌ర్శించుకున్నారు. బంగారు, వెండి బ‌ల్లుల‌ను స్ప‌ర్శించారు. ఆల‌య ఆవ‌ర‌ణ‌లో కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని ఆల‌య ట్ర‌స్టీ, చైర్మ‌న్ అల్లాణీ రామాజీరావు, మాజీ ఎంపీటీసీ వ‌డ్డె కృష్ణ‌, కొడ‌కంచి నాయ‌కులతో మాట్లాడారు. ఆల‌య విశిష్ట‌ను చైర్మ‌న్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ కు వివ‌రించారు. ఆల‌య ఆవ‌ర‌ణ, కోనేరును ఆమె ప‌రిశీలించి సంతోషం వ్య‌క్తం చేశారు. త‌హ‌సీల్దార్ దేవ‌దాసు, ఆర్ఐ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ, కార్య‌ద‌ర్శి ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.