20-09-2025 09:22:06 PM
- డిస్ట్రిక్ గవర్నర్ అమర్నాథ్ రావు
- నూతనంగా జిన్నారం, గడ్డపోతారం లయన్స్ క్లబ్ ఏర్పాటు
జిన్నారం: లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని డిస్ట్రిక్ గవర్నర్ అమర్నాథ్ రావు అన్నారు. జిన్నారం, గడ్డపోతారం మున్సపాలిటీల నూతన లయన్స్ క్లబ్ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవ చేయడం సంతోషకరమన్నారు. నూతనంగా ఏర్పాటైన క్లబ్ లు సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ లయన్స్ క్లబ్ స్నేహబంధు చైర్మన్ రాఘవేంద్ర రావు, జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం మున్సిపల్ లయన్స్ క్లబ్ చైర్మన్ గా ఆనంద్
జిన్నారం మున్సిపల్ లయన్స్ క్లబ్ చైర్మెన్ గా ఆనంద్, సెక్రటరీగా గంగురమేశ్, ట్రెజరర్ గా ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా కరుణాసాగర్ రెడ్డిలు బాధ్యతలు తీసుకున్నారు.
గడ్డపోతారం లయన్స్ క్లబ్ చైర్మన్ గా ప్రకాశ్ చారి
గడ్డపోతారం లయన్స్ క్లబ్ చైర్మన్ గా ప్రకాశ్ చారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పెంటేశ్, సెక్రటరీగా బాశెట్టి శ్రీధర్, ట్రెజరర్ గా దండే శ్రవన్ బాధ్యతలు తీసుకున్నారు.