20-09-2025 09:27:02 PM
నర్సంపేట (విజయక్రాంతి): నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ డిపో, బస్సు డిపోకు సంబంధించిన ఖాళీ స్థలాలను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy), వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం విజయ్ భానుతో కలిసి పరిశీలించారు. మెయిన్ రోడ్డు బస్టాండ్ ఆవరణానికి అనుకోని అభ్యంతరకర మైనటువంటి షాపులను వెనుకకు జరపడంతో పాటు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అంతరాయం లేకుండా రవాణా సౌకర్యం ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు అదనపు గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. అనంతరం వీటితో పాటు చెన్నారావుపేట మండలం జల్లిలో బస్టాండ్ నెక్కొండ బస్టాండు ప్రాంతాలను పరిశీలించి అతి త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డిపో మేనేజర్ లక్ష్మి ప్రసూనతో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.