20-09-2025 09:17:48 PM
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి
కల్వకుర్తి: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి అన్నారు. సేవాపక్షం 2025లో భాగంగా ఈ నెల కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత ప్రాధాన్యత నిచ్చి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని అన్నారు.