20-09-2025 09:13:00 PM
తాండూరు (విజయక్రాంతి): పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారస్తులు వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులు అందరూ సహకరించాలని తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి(Municipal Commissioner Yadagiri) అన్నారు. స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి కింద అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి శుభ్రం చేయించారు. పట్టణ ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని కమిషనర్ అన్నారు. అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛతహి సేవ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, స్థానిక జవాన్ వెంకటేష్, శాంటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.