calender_icon.png 20 September, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెయింట్ మేరీస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

20-09-2025 09:22:15 PM

జనగామ (విజయక్రాంతి): స్థానిక నెహ్రూ పార్క్ సెయింట్ మేరీస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, పాల్గొని పిల్లల్లో మంచి ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక తరగతి నుండి ఒక్కొక్క బతుకమ్మను తయారు చేసి, పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల బతుకమ్మలతో వికసించేలా చేయడం జరిగింది. విద్యార్థులంతా బతుకమ్మ పాటలకు నాట్యం చేశారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.