calender_icon.png 20 September, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల్లో రాణించి మంచి గుర్తింపు పొందాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

20-09-2025 09:14:33 PM

కల్వకుర్తి: జీవితంలో రాణించాలంటే కళాశాల స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలని అందుకు అనుగుణంగా చదువుల్లో రాణించి మంచి గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకొని జీవితంలో స్థిరపడేలా ప్రణాళికలు రచించుకోవాలని అవకాశాలను సద్విని చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, విలువైన సమయం గడిచిపోయాక ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.  విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. 

అభివృద్ధి పనులకు భూమి పూజ..!

పురపాలక పరిధిలోని జెపి నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో రూ.43 లక్షలతో జూనియర్ కళాశాలలో రూ.9లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు, రూ.25లక్షలతో సిసి రోడ్ లకు భూమి పూజ చేశారు.