20-09-2025 09:15:51 PM
పాపన్నపేట (విజయక్రాంతి): ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన "ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన", "రేవంతన్న కా సహారా మిస్కీన్" పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాపన్నపేట మండలం దూదేకుల కులస్థులు శనివారం మండల కేంద్రంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో దూదేకుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమ సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం పట్ల, నిధులు కేటాయించడం పట్ల వారు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దూదేకుల జహంగీర్, యాదుల్ పాషా, తాజుద్దీన్, అఫ్జల్, సద్దాం హుస్సేన్, ఖాజా పాషా, మహమ్మద్ తబ్రేస్ తదితరులు పాల్గొన్నారు.