calender_icon.png 4 July, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరతను తీర్చండి

02-07-2025 10:23:19 PM

కుభీర్: మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని యూరియా కోసం మండల రైతాంగం వేయికళ్లతో ఎదురుచూస్తుందని మండల ఎస్టీ రైతు నాయకుడు జాదవ్ పండిత్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. గత పదేళ్ల కాలం నుండి ఎన్నడూ లేని యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా ఉందని దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఎంత మమకారం ఉందో ఇట్లే అర్థమయిపోతుందని అన్నారు. సహకార సంఘం ద్వారా గతంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతాంగానికి ఎరువులు విత్తనాల విషయంలో ఎన్నడు కొరత రానీయలేదని ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను ప్రైవేట్ వ్యాపారులకు ఎక్కువ కేటాయిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. వారం రోజుల్లోగా రైతాంగానికి సరిపడా యూరియా డిఏపి ఎరువులను సహకార సంఘం ద్వారా అందించే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆ ప్రకటనలో  డిమాండ్ చేశారు