02-07-2025 10:20:09 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన 15 నెలల కాలంలో గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రం గణనీయ అభివృద్ధి సాధించిందని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(Government Whip Dr. Jatoth Ramachandru Naik) అన్నారు. ఈనెల 4న హైదరాబాదులో నిర్వహించే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయడానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కీలకమైన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి ప్రచారం చేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయి, మాజీ ఎమ్మెల్యే పొడేం వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శులు స్వర్ణకుమారి, సీతారాం, ఏ సముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.