5 August, 2026 | 9:37 PM

ఆదిభట్ల టౌన్‌ప్లానింగ్ అధికారి బదిలీ

03-09-2025 12:00 AM

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 2: ఆదిభట్ల మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాలపై విజయక్రాంతి దిన పత్రికలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

వరస కథనాలలో భాగంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో నిర్లక్ష్యంతో పాటు, సుమారు 5 యేండ్లకు పైగా గడుస్తున్నా ఒకే స్థానంలో పాతుకుపోయారనీ, నిర్లక్ష్యం గా విధులు నిర్వహించడం, అక్రమార్కులకు సహకారం అందించడం, ప్రభుత్వ మున్సిపాలిటీ స్థలాలను కాపాడడంలో విఫలం కావడంతో ఆమెపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ఐజా మున్సిపాలిటీ లో విధులు నిర్వహిస్తున్న  వరప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు.