6 August, 2026 | 10:27 PM

భీమవరంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ

06-08-2026 09:14 PM

భీమవరం, ఆగస్టు 05, 2026: దేశవ్యాప్తంగా తమ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించే విశాల ప్రణాళికలో భాగంగా, ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ మరియు ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్  భీమవరంలో ఒక కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో ఏబీహెచ్ఎఫ్ఎల్ మొత్తం నెట్‌వర్క్ 15 బ్రాంచ్‌లకు పెరిగింది, ఇది వేగవంతమైన వృద్ధి కలిగిన మార్కెట్లలో తన ఉనికిని బలోపేతం చేయడంతో పాటు కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేస్తుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, అందుబాటు ధరల నుంచి ఖరీదైన గృహాల వరకు వైవిధ్యమైన అవకాశాలతో స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను కలిగి ఉంది. ఇక్కడి మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు మరియు ప్రశాంతమైన నివాస ప్రాంతాలు ఇల్లు కొనుగోలు చేయడానికి అనువైన ప్రాంతంగా మారుస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం మరియు స్థానిక వనరులను మెరుగ్గా వినియోగించడం లక్ష్యంగా జిల్లాలో సాగుతున్న పారిశ్రామిక ప్రగతి ఈ ఆకర్షణను మరింత పెంచుతోంది.

ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంలోని వ్యాపారులు, చిన్న వ్యాపారవేత్తలు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారి నుంచి ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. తమ కొత్త బ్రాంచ్ ద్వారా ఎబీహెచ్‌ఎఫ్‌ఎల్  కస్టమర్ల అవసరాలకు తగిన గృహ రుణ పరిష్కారాలను మరింత సులభంగా అందిస్తూ, సొంతింటి కల నెరవేర్చుకోవడంలో తోడ్పడనుంది.

ఎబీహెచ్‌ఎఫ్‌ఎల్ వివిధ వర్గాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సమగ్ర గృహ రుణ పరిష్కారాలను అందిస్తోంది. ఇందులో అఫర్డబుల్ హౌసింగ్, ప్రైమ్ హౌసింగ్, కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ మరియు ఆస్తిపై రుణాలు (లాన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ) వంటి సేవలు ఉన్నాయి. ఇవి ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు, వ్యాపారులు మరియు కొత్తగా ఆదాయం పొందుతున్న వర్గాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా, ఎబీహెచ్‌ఎఫ్‌ఎల్ జీరో లాగిన్ ఫీజుతో పాటు రూ. 50 లక్షల వరకు తక్షణ (స్పాట్) రుణ అనుమతులను అందిస్తోంది.

ఈ ఆఫర్ 2026 ఆగస్టు 5 నుండి ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కస్టమర్లకు మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.ఈ విస్తరణపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తమకు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్ అన్నారు. ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ మరియు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా, వారితో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రాంతీయంగా సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపారు.