రాష్ట్రస్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు పారమిత విద్యార్థులు
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల, పారమిత లిటిల్ జీనియస్ ముగ్గురు విధ్యార్థులు బంగారు పథకాలు, ఐదుగురు రజిత పథకాలు సాధించి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధిం చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కవిత ప్రసాద్ తెలిపారు. ఇటీవల నగరంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 14 విభాగాలలో వి. సిరిచందన జావెలిన్ త్రో విభాగంలో బంగారు పథకం, గాలి శ్రేయాన్షి 150 మీటర్ల పరుగు పందెంలో బంగారు పథకం, 60 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, ఇల్లందుల అయాన్ బ్రాడ్ జంప్ లో బంగారు, ఉమ్మే హని 400 మీటర్ల పరుగు పందెంలో రజిత, ఆయేషా పర్ వీణ్ 60 మీటర్ల విభాగం పరుగు పందెంలో రజిత, శనిగరపు తేజవర్ధన్ రజిత, బ్రాడ్ జంప్ లో రజిత, ఆరోహి గోనె 200 మీటర్ల పరుగు పందెంలో రజిత, విలాస్ కస్తూరి 60 మీటర్ల విభాగం లో బ్రాడ్ జంప్ రజితం, తన్వి శ్రీ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కవిత ప్రసాద్, బాలాజీ, సమన్వయకర్తలు, వ్యాయామ ఉపాధ్యాయులు జిలానీ, చామనపల్లి మహేష్, సాదుల రజిత లు అభినందించారు.






