క్లియర్‌ట్రిప్ 'బస్ 2.0'తో 6.5 లక్షల రూట్లలో సేవలు
ముంబై, ఆగస్టు 5, 2026: ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ అయిన క్లియర్‌ట్రిప్.. విమాన మరియు రైలు నెట్‌వర్క్‌లకు చేరువలో లేని ప్రాంతాలతో సహా, 6,000 కు పైగా నగరాల్లోని 6.5 లక్షల రూట్లను అనుసంధానిస్తూ రోడ్డు ప్రయాణ అనుభవాన్ని మరింత విస్తృతం చేసే బస్ 2.0 ను నేడు ప్రారంభించింది. అత్యుత్తమ నెట్‌వర్క్ విస్తరణ, సులభమైన బుకింగ్ విధానం మరియు దేశంలోనే అతిపెద్ద రోడ్డు బస్సుల జాబితాతో, ప్రయాణికులు విమానాలు, రైళ్లు మరియు హోటళ్లతో పాటు బస్సులను కూడా ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా బుక్ చేసుకోవడానికి 'బస్ 2.0' వీలు కల్పిస్తుంది.
ఈ విభాగం జెన్-జెడ్ ప్రయాణికులకు ఒక ముఖ్యమైన మాధ్యమంగా అవతరించింది. నేడు, క్లియర్‌ట్రిప్‌లోని మొత్తం బస్సు బుకింగ్‌లలో 55% పైగా జెన్-జెడ్ ప్రయాణికుల నుండే వస్తున్నాయి. విద్యార్థులు, ఒంటరి ప్రయాణికులు మరియు తొలి ఉద్యోగంలో చేరిన యువత.. అందుబాటు ధరల్లో వారాంతపు విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్లేందుకు మరియు ఆకస్మిక ప్రయాణాల కోసం బస్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రైలు ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇది నమ్మకమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తూ, రోడ్డు ప్రయాణాన్ని గతంలో కంటే మరింత చేరువ చేస్తోంది.
క్లియర్‌ట్రిప్ ప్రముఖ ప్రైవేట్ ఆపరేటర్లతో పాటు రాష్ట్ర రవాణా సంస్థలను కూడా ఒకే చోట చేర్చి, ఇంటర్‌సిటీ మరియు ప్రాంతీయ రూట్లలో ప్రయాణికులకు విస్త్రత ఎంపికలను కల్పిస్తోంది. దేశంలోని దాదాపు 95% ప్రైవేట్ బస్సుల ఇన్వెంటరీతో పాటు, క్రమంగా విస్తరిస్తున్న ప్రభుత్వ బస్సు సేవల నెట్‌వర్క్ సహాయంతో.. సాధారణంగా ఫిజికల్ బస్ టెర్మినల్స్‌లో మాత్రమే లభించే ఎంపికలను ప్రయాణికులు ఇప్పుడు తమ ఫోన్ ద్వారానే పొందేలా బస్ 2.0 వీలు కల్పిస్తోంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా క్లియర్‌ట్రిప్ ఎయిర్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గౌరవ్ పట్వారీ మాట్లాడుతూ, "భారతదేశంలో మరే ఇతర రవాణా మార్గంతో పోల్చినా బస్సులు అత్యధిక ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి.
చాలా మంది యువ ప్రయాణికులకు తమ ప్రయాణ ఏర్పాట్లను స్వయంగా చూసుకోవడంలో బస్సు బుకింగ్ చేసుకోవడమే తొలి అనుభవంగా ఉంటుంది. అటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే ఈ బస్ 2.0 రూపొందించబడింది. ఇది వారికి అనుకూలమైన విధానాన్ని, విస్తృతమైన కవరేజీని, అలాగే అవసరమైనప్పుడు వారు కోరుకున్న మార్గంలో బస్సులు అందుబాటులో ఉంటాయనే భరోసాను అందిస్తుందన్నారు. భారతీయుల అన్ని రకాల ప్రయాణాలకు ఒకే వేదికగా నిలవాలనే దిశగా.. రైళ్ల విభాగంలోకి ప్రవేశించడం మరియు అంతర్జాతీయ హోటల్ సేవలను బలోపేతం చేసిన అనంతరం క్లియర్‌ట్రిప్ ప్లాట్‌ఫారమ్ నిర్మాణంలో 'బస్ 2.0' సరికొత్త ముందడుగుగా భావిస్తున్నారు.






