తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్
బోథ్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కొత్తపల్లి జయశంకర్ సార్ కృషి సహకారం ఎంతగానో ఉందని ఆయన రాష్ట్ర సాధన సిద్ధాంతకర్తతో పాటు గొప్ప మేధావి అని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేశారని తెలంగాణ ప్రజలు మర్చిపోకుండా ఆయన సేవలను గుర్తిస్తున్నారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనలో తాము ముందుంటా ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సర్పంచులు సుధీర్ రెడ్డి ,రాజు, రవీందర్, బాబూలాల్ ,సంజీవ్ మాజీ సర్పంచ్ సురేందర్, యాదవ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలుక రాజు, వీడిసి అధ్యక్షులు పోతన్న , మేడి చల్మా ప్రవీణ్ రమణారెడ్డి బత్తుల రమేష్ గంగమల్లు సంజీవ్, సందీప్, తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






