మూడున్నర కిలోల కణితి
06-08-2026 09:43 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఓ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావం కావడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ పూజిత నర్సింగ్ హోమ్ లో సీనియర్ సర్జన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం శస్త్ర చికిత్స నిర్వహించి ఆ మహిళ కడుపులో నుంచి మూడున్నర కిలోల కణితిని తొలగించారు. గర్భాశయంలో ఇంత పెద్ద కణితి ఏర్పడడం చాలా అరుదని, శస్త్ర చికిత్స అనంతరం మహిళా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు.






