నియోజకవర్గ కేంద్రం నుండి ఏ భవనం తరలిపోదు: మాజీ ఎంపీ
బోథ్,(విజయక్రాంతి) నియోజకవర్గ కేంద్రం నుండి ఏ ప్రభుత్వ కార్యాలయం తరలిపోదని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. ఐసిడిఎస్ కార్యాలయం తరలిపోదని అదేవిధంగా ట్రెజరీ కార్యాలయానికి స్థలాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలను ఒకే చోట ఏర్పాట ఏ విధంగా చూస్తున్నామన్నారు. పాత తహసిల్దార్ కార్యాలయంలో ట్రెజరీ కార్యాలయం ఉండేదని అయితే తాసిల్దార్ కార్యాలయం కూలిపోవడంతో ట్రెజరీ కార్యాలయాన్ని మార్కెట్ కమిటీ ఆవరణలో కి మార్చడం జరిగింది అన్నారు.
కాగా ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ మాట్లాడుతూ... పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలను స్థానికంగా ఉండే విధంగా చూడాలని మాజీ ఎంపీ దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. ఈ విషయమై అధికారులతో మంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అన్నారు నియోజకవర్గ కేంద్రం నుండి ఉన్న కార్యాలయాలు తరలిపోతే స్థానికంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని మాజీ ఎంపీ కి వివరించమన్నారు.






