తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కు బీజేపీ నాయకుల నివాళులు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం కేంద్ర మాజీ మంత్రి పద్మ అవార్డు గ్రహీత తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఎంతో కృషి చేసిందని తెలంగాణ విద్యార్థులకు ప్రజలకు భరోసనిస్తూ తెలంగాణను కళ్ళారా చూడాలని ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులకు ధైర్యం చెబుతూ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేసిందని .. తెలంగాణ ప్రజలు ఆమెను తెలంగాణ చిన్న పిలవడం జరిగిందని అన్నారు తెలంగాణ ఏర్పాటులో ఆమె ఎనలేని కృషి చేసిందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బిజెపి నాయకులు చీకటి రాజు పాశం భాస్కర్ రెడ్డి శివ శంకర్ అశ్విన్ మహేందర్ పురుషోత్తం పద్మ నరేష్ భూమేష్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.






