6 August, 2026 | 10:59 PM

ఇందిరమ్మ ఇళ్ళను సత్వరం పూర్తి చేయండి.

06-08-2026 09:50 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో రత్నాకర్ రావు వెలుగు ప్రత్యేక అధికారి గోవిందరావు తో కలిసి పరిశీలించడం జరిగింది. గురువారం రోజున రెండు ఇల్లు పూర్తి అయినట్లు ఎంపీడీవో తెలిపారు. అంతేగాక మండల కేంద్రంలో ఇందిర క్రాంతి భవనానికి పాఠశాలను పరిశీలించడం జరిగింది. స్థానిక పాఠశాలలో ఒక గది వినియోగంలో లేనందున అందులో వెలుగు కార్యాలయం సిబ్బంది విధులు నిర్వహించేందుకు పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం ఇందిర క్రాంతి సీసీలతో సమావేశమై మహిళా రుణాల రికవరీ రుణాల అందించడం వంటి వాటిపై చర్చించారు