మోడల్ స్కూల్‌లో స్టూడెంట్ లీడర్ కోసం ఎన్నికలు
కోదాడ (మునగాల),(విజయక్రాంతి): మునగాల మండలంలోని తెలంగాణా మోడల్ స్కూల్ నందు స్టూడెంట్స్ కోసం స్కూల్ హెడ్ బోయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బోయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ ఎంపిక కోసం గురువారం ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్స్ నిజమైన ఎలక్షన్స్ ని తలపించే లాగా జరిగినవి, స్కూల్ హెడ్ బోయ్ గా అఖిల్, హెడ్ గర్ల్ గా హేమహసిని, డిప్యూటీ హెడ్ బోయ్ గా చైతన్య,డిప్యూటీ హెడ్ గర్ల్ గా షర్మిల గెలుపొందడం జరిగింది. ఈ కార్యక్రమం లో మునగాల మండలం ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ గారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరబాబు గారు, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జమలాపురం రామకృష్ణ గారు ఇతర ఉపాధ్యాయులు పాల్గొని గెలుపొందిన స్టూడెంట్స్ కి శుభాకాంక్షలు తెలియచేయండo జరిగింది ఈ ఎలక్షన్ లో విద్యర్డులు, ఉపాధ్యాయులు ఉత్సాహం గా పాలుగొని కార్యక్రమం విజయవంతం చేయటం జరిగింది






