లోక్‌సభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్ సభ, రాజ్యసభలో గందరగోళ వాతావరణం ఏర్పాడింది. దీంతో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. విపక్ష సభ్యుల నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఇటీవల మృతిచెందిన పలువురు రాజకీయ నాయకులకు సభ సంతాపం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత స్పీకర్ చర్చను ప్రారంభించారు. ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లెవనెత్తి సభలో విద్యార్థుల కోసం చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు స్పీకర్ ఓంబిర్లా అంగీకరించకపోవడంతో పతిపక్షలు ఆందోళనకు దిగాయి.






