కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
28-06-2024 12:42 PM
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. విద్యుత్ కోనుగోలు, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టిమేయాలని కేసీఆర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్ వేసిన పిటిషన్‌పై తీర్పు ఇవాళ లేదా సోమవారం వెలువడనుంది. విద్యత్ కమిషన్ ఛైర్మన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని ప్రభుత్వం తరపున వాదనలను కోర్టుకు ఏజీ వినిపించారు. కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు జరుగగా.. ఈ పిటిషన్ పై తీర్పును సీజే ధర్మసనం రిజర్వ్ చేసింది.






