9 April, 2026 | 7:45 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

త్వరలో పరిపాలన అనుమతులు

24-02-2025 12:58 AM
  1. రాష్ర్ట వ్యవసాయ మార్కెటింగ్  డైరెక్టర్ సురేంద్రమోహన్ 
  2. ప్రభుత్వ ఆదేశాలతో కొహెడ ప్రాంతాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం
  3. సీఎం రేవంత్  రెడ్డి, మంత్రి తుమ్మలచే శంకుస్థాపన

అబ్దుల్లాపూర్ మెట్ , ఫిబ్రవరి 23: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల కొహెడ గ్రామంలో నిర్మించబోయే సమీకృత మార్కెట్‌కు త్వరలో పరిపాలన అను మతులు మంజూరు చేస్తామని రాష్ర్ట వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం గడ్డిఅన్నారం మార్కెట్ కమి టీ పాలకవర్గంతో కలిసిన కొహెడలో నిర్మించబోయే ప్రాంతాన్ని పరిశీలించారు.

అనంత రం బాటసింగారం మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గం, సిబ్బందితో ప్రత్యేకం గా భేటీ అయ్యారు. ఈ భేటీలో కొహెడలో నిర్మించబోయే మీకృత మార్కెట్ డీపీఆర్ ప్లాన్ ప్రకారం ఎలాంటి కట్టడాలు నిర్మించాలో చర్చించారు. అలాగే బాటసింగా రంలో నడుస్తున్న పండ్ల మార్కెట్ ప్రాంతా న్ని పాలకవర్గం, అధికారులతో కలిసి పరిశీలించారు.

క్రయ, విక్రయాలను స్వయంగా పరిశీలించి.. ఎగుమతులు, దిగుమతుల గుర్తించి వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ర్ట వ్యవసాయ మార్కెటింగ్ డైరె క్టర్ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ... కొహెడ గ్రామంలో నిర్మించబోయే సమీకృత మార్కెట్‌కు త్వరలో పరిపాలన అను మతులు మంజూరు చేస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులచే నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అతి త్వరలో ఉండబోతుందన్నారు. మార్కె ట్లో పండ్లు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, మాంసాహార ఉత్పత్తులు, పూలు వంటి ఉత్పత్తులకు అవకాశం ఉండబోతుందన్నారు. 200 ఎకరాలలో రూ. 2900 వంద ల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.

మార్కెట్‌కు వచ్చే రైతులకు, విని యోగదారులకు, ఉత్పత్తులు అమ్ముకునే వర్తకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా... అత్యున్నత స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ లు ఏర్పాటు చేస్తామన్నారు. బాటసింగారంలో తాత్కాలికంగా కొనసాగుతున్న మా ర్కెట్లో సమస్యలు ఎదురవుతున్నాయని... ఆ సమస్యలను అధిగమించేందుకు కొహెడలో సమీకృత మార్కెట్ త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, మార్కెటింగ్ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, జిల్లా మార్కెటింగ్ రిజిస్టర్ రియాజ్, కన్సల్టెంట్ ఉమా మహేశ్వరరావు, వైస్ చైర్మన్ సీహె భాస్కర చారి, మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ , డైరెక్టర్లు మధుసూదన్ రావు, రఘుపతిరెడ్డి, నరసింహ, జైపాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, గణేష్ నాయక్, వెంకటేశ్ గుప్తా, ఇబ్రహీంతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.