calender_icon.png 24 August, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్లు

24-08-2025 07:37:29 PM

ఈనెల 31 వరకు అవకాశం

చదువు మానేసిన వారికి మళ్ళీ విద్య అవకాశం

పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): పెద్ద కొడప్గల్ మండలంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా  ఓపెన్ పదవ తరగతి, ఓపెన్ ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుకు 14 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న పది పరీక్షలకు 10 పాసై రెగ్యులర్గా ఇంటర్ చేయనివారు ఓపెన్ ఇంటర్లలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.

ఈనెల 18 వరకు అప్లై చేసుకుని వారు అపరాధ రుసుముతో ఈనెల 31 వరకు అవకాశం ఉందని పెద్దకొడఫ్గల్ ఓపెన్ స్టడీ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ కిషోర్ ఆదివారం తెలిపారు. ఇట్టి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి చదువులకు ఉద్యోగులు పదోన్నతుల కోసం అర్హత సాధించవచ్చు అని పేర్కొన్నారు. ఇతర వివరాలకు పాఠశాలకు  9705771871, 9493859898 సంప్రదించాలని తెలిపారు.